లక్ష్మీ పార్వతిని తెలుగు అకాడమీ చైర్‌పర్సన్‌గా నియమిస్తూ జీవో జారీ చేసింది ఏపీ ప్రభుత్వం దీంతో ఆమెకు అభినందనలు పెద్ద ఎత్తున వస్తున్నాయి.. జగన్ ఆమెకు పదవి ఇచ్చారని తెలియడంతో నందమూరి అభిమానులు ఆనందంలో ఉన్నారు. అంతేకాదు ఆమెకి నందమూరి కుటుంబం ఎలాంటిసాయం చేయడం లేదు ఆమెని పట్టించుకోవడం లేదు, కాని ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా ఆమె నడిచారు అనే ప్రశంస కూడా ప్రజల నుంచి ఉంది ఈ సమయంలో వైసీపీలో ఆమె ఉన్నా టీడీపీ ని వదిలినా కొందరు ఆనాటినేతలు మాత్రం ఆమెతో మంచి సంబంధాలు కలిగి ఉన్నారు.
ఎన్నికల సమయంలో కొందరు ఆమెని రాజకీయంగా దిగజార్చేందుకు కుట్రలు పన్నారు. కాని ఆమె మాత్రం ఎలాంటి నిరాశ పడలేదు. ఎన్నికల తర్వాత ఆమెపై దుష్ప్రచారం చేసిన వారి బండారం బయటపడింది.ఇక కొంతకాలం ఆమె పార్టీలో ఇలా కొనసాగితే మహిళా కోటాలో రాజ్యసభకు కూడా పంపాలి అని జగన్ భావించారట. కాని ఆమెకు పదవి ఇవ్వలేదు అనే విమర్శలు ఇటు టీడీపీ నుంచి కూడా ఎక్కువగా వస్తున్నాయి. దీంతో వెంటనే జగన్ కూడా ఆమె విషయంలో ఆలోచించి అకాడమీ పదవిని ఇవ్వడం జరిగింది. అయితే దీనిపై నందమూరి కుటుంబం కూడా సంతోషంగా ఉంది అంటున్నారు.. తెలుగుదేశం పార్టీ నుంచి ఆమె బయటకు వచ్చినా కొందరు మాత్రం ఆమెకి సపోర్ట్ ఉన్నారట, వారు చాలా ఆనంద పడ్డారట, జగన్ ఆమెకు మంచి పదవిని ఇచ్చారు అని సంతోషం వెల్లిబుచ్చారట, ఇక జూనియర్ ఎన్టీఆర్ కూడా ఆమెకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు అని వార్తలు వస్తున్నాయి. అయితే ఫోన్ చేసి అభినందిచారు అనే వార్త కొన్ని మీడియాలలో సర్కులేట్ అవుతోంది. తారక్ నందమూరి కుటుంబంలో అందరితో సత్సంబంధాలు కలిగి ఉంటారు, ఆయన నాయనమ్మ లక్ష్మీ పార్వతితో కూడా మంచి సంబంధాలు కలిగి ఉన్నారట.