విడుదల రజిని బుర్రే బుర్ర ..

విడుదల రజిని బుర్రే బుర్ర ..

0
415

2019 ఎన్నికల్లో చిలకలూరి పేట ఎమ్మెల్యే గ గెలిచిన విడుదల రజని వైసీపీ కార్యకలాపాలలో చాల యాక్టీవ్ గ ఉంటున్నారు . ఎప్పటికప్పుడు జనాల్లో తిరుగుతూ వారితో మాట్లాడుతూ ఆమె జగన్ దగ్గర కూడా బాగానే మార్కులు కొట్టేస్తున్నారు .

అయితే ఈ మధ్య ఓ సమస్య నుండి ఆమె చాల చాకచక్యంగా బయటపడ్డారు . జగజ్జీవన్ అనే పేరుతో ఓ వ్యక్తి ఆమె కి ఫోన్ చేసి పెద్ద మొత్తం లో అప్పు ఇప్పిస్తానంటూ నమ్మబలికాడు . అయితే అతని మాట తీరు లో ఎదో తేడా గమనించిన ఈమె అప్రమత్తమై , సీఎం ఆఫీస్ కి ఫోన్ చేసి అక్కడి నుండే ఎంక్వయిరీ స్టార్ట్ చేసింది ..

ఆ పేరుతో ఎవరు లేరని తెలియటం తో ఆమె ఈ సమాచారాన్ని డీజీపీ కి అందించడం తో పోలీసులు రంగం లోకి దిగి ఆ వ్యక్తిని అరెస్ట్ చేసారు . అయితే అతను ఇంతకుముందు కూడా ఇలాంటి మోసాలకు పాల్పడ్డాడని పోలీసులు చెబుతున్నారు . అయితే విడుదల రజిని చేసిన ఈ పనికి పార్టీ వర్గాల నుండి ప్రశంసలు కురుస్తున్నాయి .