బాబుకు షాక్ జగన్ గ్రీన్ సిగ్నల్ వైసీపీలోకి 10 మంది టీడీపీ ఎమ్మెల్యేలు

బాబుకు షాక్ జగన్ గ్రీన్ సిగ్నల్ వైసీపీలోకి 10 మంది టీడీపీ ఎమ్మెల్యేలు

0
91

ఏపీ ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు దెబ్బమీద దెబ్బ తగులుతున్నాయి. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పరిపాలనలో సరికొత్త నిర్ణయాలు తీసుకునే పనిలో బిజీగా ఉంటే చంద్రబాబు నాయుడు పార్టీ నేతలను కాపాడుకునే పనిలో బిజీగా ఉన్నారట. సాధారణంగా అయితే అధికార పార్టీనాయకులు ఒక పక్క పాలన చేస్తూనే మరో పక్క ప్రతిపక్షానికి చెందిన నాయకులను పార్టీలోకి లాగేందుకు ప్రయత్నాలు చేస్తారు.

కానీ జగన్ ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు… ఆయన పరిపాలన చూసే సుమారు 10 మంది టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీలో చేరేందుకు సిద్దంగా ఉన్నారని వైసీపీనేతలు అంటున్నారు. ఇటీవలే పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ స్వయంగా చెప్పారు జగన్ ఓకే చెబితే వైసీపీలో చేరేందుకు 10 టీడీపీ ఎమ్మెల్యేలు సిద్దంగా ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు..

అయితే జగన్ మాత్రం పార్టీలో చేరేందుకు వచ్చిన వారు మాత్రం ఖచ్చితంగా తమ పదవులకు రాజీనామా చేసి రావాలని శరతలు పెట్టారు అందుకే టీడీపీ ఎమ్మెల్యేలు ఆలో చిస్తున్నారని అంటున్నారు…కొందరు అయితే రాజీనామా చేసి అయినా సరే వైసీపీలో చేరాలని చూస్తున్నారట.