100 డేస్ సందర్భంగా లోకేశ్ ట్వీట్

100 డేస్ సందర్భంగా లోకేశ్ ట్వీట్

0
84

రాజధానిని అమరావతిలోనే ఉంచాలని డిమాండ్ చేస్తూ రాజధాని రైతులు చేస్తున్న దీక్ష నేటికి 100 రోజులు పూర్తి చేసుకుంది… అసెంబ్లీలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకువచ్చిన నాటినుంచి రైతులు రోడ్డెక్కి ధర్నాలు చేసిన సంగతి తెలిసిందే… ఈ సందర్భంగా టీడీపీ నేత లోకేశ్ స్పందించారు…

జై అమరావతి ఉద్యమం 100 రోజులకు చేరుకుందని అన్నారు పెయిడ్ ఆర్టిసులు, రైతులు గోచి కట్టుకుని బురదలో ఉండాలి అంటూ అవమానాలు ఒక పక్క… లాఠీ దెబ్బలు, వేల సంఖ్యలో కేసులు, వేల మందిని జైలు కి పంపడం మరో పక్క… అయినా సహనం కోల్పోలేదని అన్నారు

ఐదు కోట్ల ప్రజల భవిష్యత్తు అమరావతిని కాపాడుకోవడానికి వంద రోజులుగా మేము సైతం అంటూ ముందుకు వచ్చిన రైతులు, మహిళలు, యువత కి ఉద్యమ వందనాలని లోకేశ్ అన్నారు…