Apలో ‘108’ పని చేయడం లేదు..ఈ నెంబర్ కు కాల్ చేయండి

0
74

ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు మనుషులను సత్వరమే ఆసుపత్రికి తరలించే వాహనమే 108 అంబులెన్స్. ప్రాణాపాయం ఉన్నప్పుడు 108 అనే నెంబర్ అందరి నోళ్లలో నానుతుంది. ఆ నెంబర్ కు కాల్ చేసి సకాలంలో ఆసుపత్రిలో చేర్చి నిండు ప్రాణాలను కాపాడుకోవచ్చు. కానీ ఏపీలో అప్పుడప్పుడు ఈ సర్వీస్ ప్రజలకు అందుబాటులో ఉండట్లేదు. దీనిపై ఏపీ అడిషనల్ CEO , 104 & 108 సర్వీస్ గురించి ముఖ్య ప్రకటన చేశారు.

సర్వర్ లో సాంకేతిక కారణాల వలన 108 ఫోన్ నెంబర్ తాత్కాలికంగా పని చేయడం లేదు. అయితే ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, అందుకు ప్రత్యామ్నాయంగా మరో నెంబర్ తో ఆ సేవలు పొందవచ్చని తెలిపారు. అంబులెన్స్ సర్వీస్ కొరకు 104(1) కి ఫోన్ చేయాలని ఆయన సూచించారు.