తెలంగాణలో పదో తరగతి పరీక్షా ఫలితాలు విడుదల అయ్యాయి. విద్యాశాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను ప్రకటించారు. ఈ ఫలితాల్లో మొత్తం 90 శాతం ఉత్తీర్ణత సాధించగా.. బాలురు 87.61 శాతం ఉత్తీర్ణత, బాలికలు 92.45 శాతం ఉత్తీర్ణత సాధించారు. పదో తరగతి ఫలితాల్లో సిద్దిపేట జిల్లా మెుదటి స్థానం పొందగా ఆ తరువాతి స్థానాల్లో నిర్మల్, సంగారెడ్డి నిలిచాయి. 15 పాఠశాలల్లో ఒక్క విద్యార్థి కూడా పాస్ కాలేదు. ఆగస్టు 1 నుంచి 10 వరకు అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి.
కాగా మే 23 నుంచి ఈనెల 1 వరకు రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా 11 వేల 401 పాఠశాలలకు చెందిన.. 5 లక్షల 9 వేల 275 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరయ్యారు. తమ ఫలితాలను TSBSE (Telangana State Board Of Secondary Education) అధికారిక వెబ్ సెట్ లో చెక్ చేసుకోవచ్చు. మార్కుల షీట్ ను కూడా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
ఫలితాలు చూసుకోవడం కోసం కింది లింక్ ను క్లిక్ చేయండి.
http://bse.telangana.gov.in, bseresults.telangana.gov.in