పది- ఇంటర్ పరీక్షలు రద్దు అందరూ పాస్ నో ఫెయిల్

పది- ఇంటర్ పరీక్షలు రద్దు అందరూ పాస్ నో ఫెయిల్

0
37

ఇప్పటికే లాక్ డౌన్ వేళ స్కూళ్లు కాలేజీలు తెరచుకోవడం లేదు, దీంతో అందరూ ఇంటి పట్టున ఉంటున్నారు.. ఇప్పటికే 50 రోజులుగా దేశం లాక్ డౌన్ లో ఉంది.. మరోసారి లాక్ డౌన్ పెంచే ఆలోచనలో కేంద్రం ఉంది, ఈ సమయంలో కొన్ని స్టేట్స్ విద్యార్దులకి పరీక్షలు పెట్టకుండా నేరుగా వారిని తర్వాత తరగతులకి ప్రమోట్ చేస్తున్నారు.

ఈ సమయంలో పది ఇంటర్ పరీక్షలు కొన్ని స్టేట్స్ నిర్వహించాలి అని చూస్తున్నాయి, ఏపీ తెలంగాణలో కూడా ఈ ఏర్పాట్లు జరుగుతున్నాయి, కాని తాజాగా టెన్త్, ఇంటర్ పరీక్షలపై ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టెన్త్, ఇంటర్ విద్యార్థులను పరీక్షలు నిర్వహించకుండానే పై తరగతులకు ప్రమోట్ చేయాలని నిర్ణయించింది.

అయితే వారిని ఎలా పాస్ చేస్తారు అనేది చూస్తే, వారికి ఇంటర్నల్ పరీక్షల్లో వచ్చిన మార్కులను ప్రామాణికంగా తీసుకొని, పై చదువులకు ప్రమోట్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ వైరస్ సమయంలో పరీక్షలు నిర్వహించడం కష్టం అని ఈ నిర్ణయం తీసుకున్నారట, అంతేకాకుండా కొత్త అకడమిక్ ఇయర్ కు ఇది ఇబ్బంది అని అందుకే, ఈ డెసిషన్ తీసుకున్నారు అని తెలుస్తోంది. ఇక పంజాబ్ కూడా ఇదే ఆలోచన చేస్తుంది అని తెలుస్తోంది.