15 ల‌క్ష‌ల మందిపై కేంద్రం సంచ‌ల‌న నిర్ణ‌యం చ‌ర్య‌లు తీసుకోండి

15 ల‌క్ష‌ల మందిపై కేంద్రం సంచ‌ల‌న నిర్ణ‌యం చ‌ర్య‌లు తీసుకోండి

0
110

క‌రోనా వైర‌స్ మ‌న దేశంలో ఎక్కువ‌గా ఇత‌ర దేశాల నుంచి వ‌చ్చిన వారి వ‌ల్ల పాకేసింది, ఇలా ఆ కుటుంబంలో వారికి తెలియ‌కుండా ఒక‌రి నుంచి మ‌రొక‌రికి పాకేసింది, ఇప్పుడు వారు ఎవ‌రిని క‌లిశారు ట్రావెల్ హిస్ట‌రీ ఉన్న‌వారు ఎక్క‌డ ఎక్క‌డ తిరిగారు ..ఇలా అన్ని తెలుసుకుంటున్నారు అధికారులు.

అయితే క‌రోనా వైర‌స్ విస్త‌రిస్తున్న నేప‌థ్యంలో మ‌న ప్ర‌భుత్వం ముందుగానే అల‌ర్ట్ అయింది, ఇక తాజాగా విదేశాల నుంచి ఇండియాకు వ‌చ్చిన 15 లక్షల మందిపై నిఘాకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. వీరంతా జనవరి 15 నుంచి 23 మార్చి మధ్య దేశానికి వచ్చిన వారే.

వీరిందరికీ పరీక్షలు నిర్వహించి క్వారంటైన్‌ నిఘా పెట్టాలంటూ రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. క‌చ్చితంగా వీరు మ‌రో 14 రోజులు క్వారంటైన్ లో ఉండాల్సిందే, ప్ర‌భుత్వం మాట విన‌కుంటే చ‌ర్య‌లు తీసుకోవాలి అని తెలిపారు కేంద్రం నుంచి ఉన్న‌త అధికారులు.