వాహ‌న‌దారుల‌కి సుప్రీం కోర్టు గుడ్ న్యూస్

వాహ‌న‌దారుల‌కి సుప్రీం కోర్టు గుడ్ న్యూస్

0
38

ఇప్ప‌టికే ఇండియాలో బీఎస్ 4 వాహ‌నాల‌కు కేవ‌లం మార్చి నెల వ‌ర‌కూ మాత్ర‌మే స‌మ‌యం ఉంది, మార్చి 31 త‌ర్వాత వీటిని అమ్మ‌డానికి లేదు కొన‌డానికి లేదు అందుకే బైక్ షోరూమ్ లు త‌మ కంపెనీకి చెందిన బైక్స్ కి ఆఫ‌ర్ పెట్టి మ‌రీ అమ్ముతున్నారు.

తాజాగా మార్చి 31 డెడ్ లైన్ ను తొలగిస్తున్నట్టు సుప్రీంకోర్టు పేర్కొంది. లాక్ డౌన్ ముగిసిన తరువాత, మరో 10 రోజుల పాటు అంటే, ఏప్రిల్ 24 వరకూ ఇప్పటికే స్టాక్ బుక్ లో ఉన్న వాహనాలను విక్రయించుకోవచ్చని స్పష్టం చేసింది.

ప్రస్తుత పరిస్థితులు, వ్యాపారులు, డీలర్లలో నెలకొన్న ఆందోళన నేపథ్యంలో లాక్ డౌన్ ముగిసిన తరువాత 10 రోజుల్లోగా తమ స్టాక్స్ ను విక్రయించుకునే వెసులుబాటు కల్పిస్తున్నట్టు పేర్కొంది. ఇప్ప‌టికే చాలా మంది అమ్మ‌కాలు లేక అలాగే లాక్ డౌన్ తో షాపులు తీయ‌డం లేదు. అందుకే ఈ నిర్ణ‌యం తీసుకుంది సుప్రీం కోర్టు.