1994 ఆగస్ట్ 2019 నవంబర్ టీడీపీలో చరిత్ర

1994 ఆగస్ట్ 2019 నవంబర్ టీడీపీలో చరిత్ర

0
115

ఏపీలో చంద్రబాబు అమరావతి పర్యటన స్టేట్ లో పొలిటికల్ హీట్ టెన్షన్ తెప్పించింది.. మొత్తానిక ఆరు నెలల్లో వైసీపీ ఏమీ చేయలేదు అని విమర్శిస్తే ,మరి ఐదు సంవత్సరాల పాలనలో మీరు ఏం చేశారు అనేలా తెలుగుదేశం పార్టీని వైసీపీ విమర్శించింది… మొత్తానికి రైతులు చంద్రబాబు పై తిరగబడటం బాబు గో బ్యాక్ అంటూ నినాదాలు చేయడం చూశాం.

తాజాగా చంద్రబాబునాయుడి కాన్వాయ్ మీద కొందరు చెప్పులు విసిరారు.దీనిపై టీడీపీ కూడా రాద్దాంతం చేసింది. ఇలాంటి చర్యలకు దిగడం పై విమర్శలు చేసింది. అది వైసీపీకి సంబంధం లేదు అని క్లారిటీ కూడా ఇచ్చారు.

అయితే గతంలో జరిగిన ఓ సంఘటన ఇప్పుడు టీడీపీ సినియర్లకు గుర్తుచేస్తున్నారు. గతంలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావుకు ఎదురైన అవమానం ఇప్పుడు చంద్రబాబునాయుడుకి కూడా ఎదురైంది అనే చర్చ ఏపీలో జరుగుతోంది. 1994 ఆగస్ట్ సంక్షోభం సమయంలో ఓ హోటల్లో ఉన్న టీడీపీ ఎమ్మెల్యేలను కలిసేందుకు ఆరోజు ఎన్టీఆర్ వచ్చారు.

అప్పుడు కొందరు ఎన్టీఆర్ పై చెప్పులు విసిరారు.. దీంతో ఇప్పుడు చంద్రబాబు కు ఆనాడు ఎన్టీఆర్ కు ఇలాంటి పరాభవం ఎదురు అయింది అంటున్నారు. ఆ పార్టీ నేతలు.