ఏపీలో ఏప్రిల్ లో ఎన్నికలు షెడ్యూల్ ఇదే

ఏప్రిల్ 11న ఏపీలో ఎన్నికలు ఇదే షెడ్యూల్

0
112

దేశంలో ఎన్నికల నగారా మోగింది, ఎప్పుడెప్పుడా అని చూస్తున్న లోక్ సభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల అయింది. 17వ లోక్ సభకు ఎన్నికలు జరుగనున్నాయి . 543 ఎంపీ స్ధానాలకు, నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ స్ధానాలకు షెడ్యూల్ విడుదల అయింది. ఏపీ ఒడిశా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరుగనున్నాయి.

సీఈసీ సునీల్ అరోరా చెప్పిన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం…చాలా రోజుల నుంచి ఎన్నికలకు ఏర్పాట్లు చేస్తున్నాం. స్వేచ్చాయుత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నాం, అన్ని రాష్ట్రాల ఈసీలతో చర్చలు జరిపాము అన్నారు సీఈవో సునీల్ అరోరా. వివిధ రాష్ట్రాల్లో ఎన్నికలు పరిశీలించామని, విద్యార్దులు, ఎగ్జామ్స్ , పండుగలు అన్ని పరిగణలోకి తీసుకుని ఏర్పాట్లు చేశామని వెల్లడించారు. రైతులకు ఇబ్బంది లేకుండా ఈ షెడ్యూల్ ఉందన్నారు..99.36 శాతం ఓటర్లకు గుర్తింపు కార్డులు ఉన్నాయి. ఓటర్ల తుది జాబితా ప్రకటించిన తర్వాత మార్పులు ఉండవు అని తెలియచేశారు. పోలీంగ్ కు ఐదు రోజుల ముందు ఓటర్ స్లిప్పులు ఇవ్వనున్నారు. ఈసారి మొత్తం దేశీయ ఓటర్లు 90 కోట్ల మంది ఉన్నారు. తొలిసారి ఓటు వేసే వారు కోటిన్నర మంది ఓటర్లు ఉన్నారు. కొత్తగా ఓటు నమోదు చేసుకున్న ఓటర్లు 8.4 కోట్ల మంది ఉన్నారు. ఇక ఏప్రిల్ 11 న ఏపీలో ఎన్నికలు జరుగనున్నాయి. సరిగ్గా నెలరోజులు మాత్రమే ఎన్నికలకు సమయం ఉంది. ఏప్రిల్ 11న ఏపీలో ఎన్నికలు అని ప్రకటించింది ఈసీ.