కేఏ పాల్ కి షాకిచ్చిన జగన్ బాబాయ్ వైవీ సుబ్బారెడ్డి

కేఏ పాల్ కి షాకిచ్చిన జగన్ బాబాయ్ వైవీ సుబ్బారెడ్డి

0
33

ప్రతీ సారి ఎన్నికల్లో ఎవరో ఒకరు కొత్తవారు ఎంట్రీ ఇవ్వడం జరుగుతూనే ఉంటుంది. 2009లో చిరు, 2014 లో పవన్, 2019లో కేఏ పాల్. ఇక ఇప్పుడు స్టార్ గా వెలుగు వెలుగుతున్నారు కేఏ పాల్. ఆయన పార్టీ 175 స్ధానాల్లో పోటీ చేస్తుందని, ఇలాంటి వేవ్స్ ఉంటే కచ్చితంగా 170 స్ధానాలు గెలుచుకుంటాము అనే ఉత్సాహంతో ఆయన మీడియా మీటింగుల్లో తెలియచేస్తున్నారు. అయితే పాల్ ప్రజాశాంతి పార్టీకి ఇటీవల ఎన్నికల కమిషన్ హెలికాఫ్టర్ గుర్తు కేటాయించిందది.

మరి ఇప్పుడు ఈ ఎన్నికల కమిషన్ హెలీకాఫ్టర్ గుర్తును రద్దు చేసింది అని తెలుస్తోంది. సో ఎందుకు అంటే ఆయన హెలికాఫ్టర్ గుర్తు తమ పార్టీ గుర్తు ఫ్యాన్ ను పోలి ఉందని, వెంటనే ప్రజాశాంతి పార్టీకి హెలికాఫ్టర్ గుర్తును రద్దు చేసి వేరే గుర్తు కేటాయించాలని వైసీపీ మాజీ ఎంపీ జగన్ బాబాయ్ అయిన వైవీ సుబ్బారెడ్డి ఈసీని కలిసి కోరారు.. దీనిపై వివరణ కూడా ఇచ్చారు. ఎన్నికల సమయంలో ముందే మేల్కొని వైసీపీ ఈసీకి కంప్లైంట్ ఇవ్వడంతో వైసీపీ శ్రేణులు ఆనందించారు.

ఇక ఈ మేరకు నిర్ణయం తీసుకుని ప్రజాశాంతి పార్టీకి నోటీసులు జారీ చేసింది ఎలక్షన్ కమిషన్.. దీనిపై స్పందించిన కేఏ పాల్ తమ పార్టీకి హేలీకాఫ్టర్ గుర్తునే కేటాయించాలని కోరారు, అయితే ఈసీ నుండి ఎలాంటి రిప్లై రాలేదు…దీంతో ఇక ఆయన గుర్తు విషయంలో వైసీపీ పై చేయిసాధించింది. ఆయన ఇక హెలికాఫ్టర్ గుర్తు వాడుకునే అవకాశం లేకుండా పోయింది, ఇక పార్టీలకు గుర్తుల విషయంలో ఈసీ కఠినంగా ఉంటోంది. గత తెలంగాణ ఎన్నికల్లో కొందరు ఇండిపెండెంట్లకు కూడా ఇలాగే ట్రక్కు గుర్తు రావడంతో టీఆర్ఎస్ పార్టీ కొన్ని చోట్ల ఓట్లను కోల్పోయింది ..కారు ట్రక్కు ఒకేలా ఉండటంతో ఇండిపెండెంట్లు కొందరు మంచి ఓటు బ్యాంకు సాధించారు. అందుకే ఏపీలో ఇప్పుడు ఇలాంటి కఠిన నిర్ణయం తీసుకుంది ఈసీ.