గుడివాడలో కొడాలి నానికి బంపర్ ఆఫర్

గుడివాడలో కొడాలి నానికి బంపర్ ఆఫర్

0
71

మొత్తానికి గుడివాడలో ఎదురులేకుండా ఉన్న ఎమ్మెల్యే కొడాలినానికి ఇక మరో తిరుగులేని విజయం సొంతం అవుతుంది అంటున్నారు అక్కడ వైసీపీ శ్రేణులు. ముఖ్యంగా గుడివాడలో నాని ఏది చెబితే అది. నానికి ఎదురులేదు .అయితే ఇప్పుడు వైసీపీ తరపున ఆయన మరోసారి ఎమ్మెల్యేగా బరిలోకి దిగనున్న విషయం తెలిసిందే. ఇక తెలుగుదేశం పార్టీ మాత్రం నానికి పోటీగా ఎవరిని బరిలోకి దించాలి అని మల్లగుల్లాలు పడింది.

అంతేకాదు వైసీపీ తరపున నాని తప్పమరొకరు లేరు. కాని తెలుగుదేశం పార్టీలో ఇప్పటి వరకూ ఇంచార్జ్ గా ఉన్న రావి వెంకటేశ్వరరావు నానిపై పోటికి దిగినా గెలిచే అవకాశాలు లేవు అని పలు సర్వేలు వెల్లడించాయి..దీంతో బాబు ఇక్కడ దివంగత దేవినేని రాజశేఖర్ (నెహ్రూ) తనయుడు అవి నాష్కు టికెట్ను ఇవ్వాలి అని ఫిక్స్ అయ్యారు.. ఇక ఆయన పేరును ఖరారు చేశారు. అయితే స్ధానికంగా ఇక్కడ వ్యక్తి కాకపోవడంతో రావికంటే దారుణంగా అవినాష్ గ్రాఫ్ ఉంటుంది అని ఇక్కడ నేతలు చెబుతున్నారు.

స్ధానికులకు కాకుండా వేరే వారికి ఇక్కడ టికెట్ ఇస్తే సమస్యలు కాదు ముందు గుడివాడ గురించి కూడా అవినాష్ కు ఏమీ తెలియదు. ఇక ఎలా గెలుస్తారు అని మరోసారి బంపర్ ఆఫర్ కొడాలి నానికి ఇక్కడ ప్రజలు ఇవ్వనున్నారు అని, మరోసారి నాని విజయం తథ్యం అని అంటున్నారు గుడివాడ నేతలు.