2024లో టీడీపీకి ఎన్ని సీట్లు వస్తాయో తెలుసా…

2024లో టీడీపీకి ఎన్ని సీట్లు వస్తాయో తెలుసా...

0
87

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ ఏపీఐఐసీ చైర్మన్ రోజా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు… నగరంలో పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొన్న రోజా ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు…

చంద్రబాబు నాయుడు ప్రతిపక్షనేత కాదని పనికిమాలిననేత అని ఆరోపించారు… 2019 ఎన్నికల్లో టీడీపీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్పినా కూడా బుద్దిమారడంలేదని ఆరోపించారు… ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలకు వస్తున్న విశేష ఆధరణ చూసి తట్టుకోలేక ప్రజా చైతన్య యాత్ర చేస్తున్నారని ఆరోపించారు..

ఈ యాత్రను ప్రజలు ఎవ్వరు నమ్మె పరిస్థితిలో లేరని అన్నారు.. వైసీపీ హయాంలో చంద్రబాబు నాయుడు టీడీపీ నాయకులు తప్పితే ప్రజలందరు సంతోషంగా ఉన్నారని తెలిపారు… ఈ ఎన్నికల్లో టీడీపీకి 23 సీట్లు మాత్రమే వచ్చాయని వచ్చే ఎన్నికల్లో అవికూడా రావని అన్నారు…