అల్టిమేటమ్ మూడునెలల్లో జగన్ జైలుకేనట

అల్టిమేటమ్ మూడునెలల్లో జగన్ జైలుకేనట

0
99

వచ్చే ఆరు నెలల్లో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకి ప్రతిపక్ష హోదా ఉండదని చిలక జోస్యం చెప్పిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డికి మూడు నెలల్లో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి జైలుకి పోతారు, ముఖ్యమంత్రి పదవి ఉడిపోతుంది అని తెలియకపోవడం ఆశ్చర్యంగా ఉందని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అన్నారు…

ఈ విషయాన్ని వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు జరిగే పరిణామాలను పసిగట్టినట్టు ఉన్నారని అన్నారు అందుకే వారు బీజేపీతో టచ్ లో ఉన్నారతెలిపారు. జగన్, అలాగే వియసాయిరెడ్డి ఢిల్లీలో తలవంచుకొని నిలబడుతున్నారని బుద్దా వెంకన్న ఎద్దేవా చేశారు…

అలాగే నిరా రక్షిత కి నిరక్షరాస్యత కి తేడా తెలియకుండా ఇంగ్లీష్ కోసం ఉద్యమం చేస్తున్న మీ తింగరి మాలోకం జగన్ మోహన్ రెడ్డికి ముందు తెలుగు నేర్పండి విజయసాయిరెడ్డి అని ప్రశ్నించారు… అసలు ఏమి చదివాడో తెలియదు, ఎక్కడ చదివాడో తెలియదు తెలుగు చూసి చదవడం, ఇంగ్లీష్ చూడకుండా పలకడం రాని తింగరి మాలోకాన్ని బాహుబలి చెయ్యాలి అనే మీ కామెడీ అదుర్స్ అని విమర్వించారు బుద్దావెంకన్న