40 ఏళ్ల అనుభవానికి ఇదే నా సవాల్- వైసీపీ

40 ఏళ్ల అనుభవానికి ఇదే నా సవాల్- వైసీపీ

0
81

ఉపాధి హామీ పనులు, నిధులు విషయంలో అసెంబ్లీలో వాడీ వేడి చర్చ జరిగింది… కేంద్ర నుంచి నిధులు విడుదల అయినా కూడా పెండిగ్ లో ఉన్న బిల్లులు ఎందుకు మంజూరు చేయలేదని టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు ప్రశ్నించారు…

కావాలనే కొన్ని జిల్లాలకు మాత్రమే నిధులు విడుదల చేస్తున్నారని ఆయన వాపోయారు… అలాగే చంద్రబాబు నాయుడు కూడా మాట్లాడారు… ఉపాధి హామీల వనుల నిధుల విడుదల కోసం ముడుపులు తీసుకున్నారని ఆరోపించారు… దీనిపై స్పందించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తాను ముడుపులు తీసుకున్నానని నిరూపిస్తే మంత్రిపదవికి అలాగే శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు…

తన వ్యక్తిత్వం గురించి చంద్రబాబు నాయుడుకు తెలుసని అన్నారు… అన్నీ తెలిసి కూడా తనపై ఆరోపణలు చేయడం సబబు కాదని అన్నారు… అన్ని క్లియర్ గా ఉన్న పనులకు మాత్రమే బిల్లులు విడుదల చేస్తామని అన్నారు…