ఆ ఆలయానికి 20 కేజీల బంగారం ఇచ్చిన ముఖేష్ అంబానీ

ఆ ఆలయానికి 20 కేజీల బంగారం ఇచ్చిన ముఖేష్ అంబానీ

0
97

భారత దేశంలో కుబేరుడు ప్రపంచంలో సంపన్నుల్లో ఒకరు ముఖేష్ అంబానీ… ఆయన ఏం చేసినా సంచలనమే అని చెప్పాలి, జియోతో వ్యాపారం దూసుకుపోతోంది, అయితే ఆయనకు ఎంత దైవభక్తి ఉందో తెలిసిందే, నిత్యం పూజలు చేస్తారు, అలాగే దేవాలయాలుకు వెళతారు, ముంబైలో ఎన్నో దేవాలయాలకు ఆయన విరాళాలు అందించారు, పలు దేవాలయాలు కట్టించారు కోట్ల విలువైన ఆభరణాలు అందించారు.

తాజాగా అస్సాంలోని ప్రముఖ దేవాలయమైన కామాఖ్యాదేవి ఆలయం గోపురాలు, పైకప్పుకు తాపడం పనులు చేయిస్తున్నారు. ఈ సమయంలో ముఖేష్ అంబానీ భారీ విరాళం అందించారు…20 కేజీల బంగారం విరాళంగా ఇచ్చారు. దీపావళి పండుగ రోజున బంగారాన్ని అలంకరించనున్నారు.

అక్టోబర్ 12 నుంచి ఆలయాన్ని తెరిచిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ ఆలయ పనులు జరుగుతున్నాయి, నిత్యం వేలాది మంది భక్తులు ఇక్కడకు దర్శనానికి వస్తూ ఉంటారు, ఇటీవల పనులు ప్రారంభించిన సమయంలో అంబానీ కామాఖ్యా ఆలయ నిర్వహణ కమిటీని సంప్రదించారు.ఆర్ఐఎల్కు చెందిన జ్యువెలరీ విభాగం ఈ పనులను చూసుకుంటోంది. ఈ పనులు పూర్తి అయిన తర్వాత ఆయన కుటుంబం ఇక్కడ ఆలయానికి రానున్నారట.