ఏమిటో ఈ సమాజం పెళ్లి సంబంధానికి వెళితే అంతా ఉద్యోగులు కావాలి అని కోరుతున్నారు.. ఆ ఉద్యోగులు కూడా పని చేసిన తర్వాత తినేది ఈ నాలుగు మెతుకులే.. అవి కావాలి అంటే రైతు ఉండాలి. కాని పెళ్లికి మాత్రం రైతు వద్దు… రైతుగా ఉంటే వ్యవసాయం చేస్తుంటే వారికి పెళ్లికి పిల్లని ఇవ్వడానికి ఎవరూ ముందుకు రావడం లేదు.. కొందరు మాత్రమే వస్తున్నారు.
అయితే గణపతి అనే రైతు తన బాధ చెప్పుకున్నాడు. మా మావయ్య కూతురు డిగ్రీ చదివింది చిన్నతనం నుంచి నాకు ఇచ్చి వివాహం చేస్తాను అని చెప్పారు. కాని ఆమె డిగ్రీ అయ్యాక మానాన్న పెళ్లికి వెళ్లి అడిగితే నీ కొడుకు రైతు, నా కూతురికి ఉద్యోగస్తులు వస్తున్నారు ఇవ్వను అన్నాడు, మా నాన్న ఇంటికి వచ్చేశాడు.
ఇప్పుడు దానికి పది లక్షల కట్నం పది తులాల బంగారంతో 50 వేల జీతం వచ్చే ఉద్యోగికి ఇచ్చి పెళ్లి చేశారు, అయితే ఆ అబ్బాయి కూడా నగదు పక్కన పెట్టి పొలం కొందాం వచ్చే రోజుల్లో బోళ్లు రేటు వస్తుంది అంటున్నాడట, నాకు 10 ఎకరాలు ఉంది అతను అలా 50 వేలతో ఎంత నగదు పో చేసి, పది ఎకరాలు కొనగలడు.. ఇలా ఉద్యోగులు కూడా నగదు దాచి ఆ పొలమే కొంటున్నారు, అదే పొలం మాకు ఉంది పిల్లని ఇవ్వండిరా అంటే ఇవ్వడం లేదు.
మార్పు రావాలి అమ్మాయి తల్లిదండ్రుల అందరిలో
ఇట్లు
మీ గణపతి