ఆ ఐదు శాఖలపై జగన్ ఫోకస్… అందులో ఒక మంత్రిని క్లాస్ పీకిన జగన్

ఆ ఐదు శాఖలపై జగన్ ఫోకస్... అందులో ఒక మంత్రిని క్లాస్ పీకిన జగన్

0
98

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తనదైన శైలిలో వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు… ఆయన అధికార పగ్గాలు చేపట్టిన వెంటనే చేసిన తొలిపలుకుల్లో కీలకమైంది… అవినీతి రహితం… తన పాలనలో పైసా కూడా అవినీతి జరగకూడదని ఆయన చెబుతున్నారు… ఏ కార్యక్రమం ఏ పథకం చేపట్టినా అవినీతి రహితంగా ఉండాలని సూచిస్తున్నారు…

అయినప్పటికీ కొందరు నాయకులు అనివార్య పరిస్ధితిలో కావచ్చు వ్యూహాలు కావచ్చో దారి తప్పే పరిస్ధితి ఉందని గమనించిన సీఎం జగన్ ముఖ్యమైన ఐదు శాఖలపై నిఘా పెట్టారట… ఆదిలో ఆయా శాఖల మంత్రులను జగన్ ఫ్రీగానే వదిలేశారు…

అయితే కొన్నాళ్లకు ఆయా శాఖలపై కొన్ని ఫిర్యాదులు నేరుగా సీఎం జగన్ కే అందాయని తెలిసింది… మహిళా మణులు నిర్వహించే శాఖల్లో వారి పతులు చక్రం తిప్పుతున్నారని ఆ క్రమంలో చేతులు తడుపుకుంటున్నారని కూడా జగన్ కు సమాచారం అందింది దీంతో వారిని జగన్ క్లాస్ తీసుకున్నాడు…