సొంత ఇల్లు కట్టుకోవాలి అనే కోరిక చాలా మందికి ఉంటుంది, మరీ ముఖ్యంగా పేదలు మధ్యతరగతి వారు చాలా మంది తమ జీవితం తమ సొంత ఇంటిలో ఉండాలి అని ఎన్నో కలలు కంటారు, సొంత ఇంటిని నిర్మించుకోవడానికి ఎంతో కష్టపడతారు.. అప్పులేకుండా ఇల్లు కట్టుకోవాలి అని చాలా మంది ఆశించి నగదు కూడబెట్టుకుంటారు.
కేవలం 86 రూపాయలకే ఇల్లు సొంతం చేసుకునే సువర్ణావకాశం వస్తుంటే ఎవరు వదులుకుంటారు, మరి ఇప్పుడు ఇలాంటి అవకాశం వస్తోంది.ఇటలీలోని సలేమీలో సిసిలో పట్టణంలో ఈ ఆఫర్ ప్రకటించారు. ఒక్క యూరోకే ఇల్లు తీసుకోండి అంటూ జనాలను ఆకర్షించే పనిలో పడ్డారు.
1968లో సిసిలీలో భూకంపం వచ్చి అక్కడి ప్రాంతాన్ని, జనజీవనాన్ని అస్తవ్యస్తం చేసింది. అప్పటి నుంచి అక్కడి ప్రజలు బతుకుదెరువు కోసం నగరాలకు వలస వెళ్తూనే ఉన్నారు. ఇక అక్కడ జనం ఎవరూ ఉండటం లేదు, అయితే ఇక్కడ మరికొన్ని నెలలు అయితే ఇక జనం ఉండరు అని భావించి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
ఒక్క యూరోకే ఇల్లు పథకం ప్రకటించారు. ఒక్క యూరో అంటే భారత కరెన్సీలో 86 రూపాయలు. ఇక ఇక్కడ ఇళ్లు కొనడానికి చాలా మంది ముందుకు వస్తున్నారు, ఇక్కడ ఈ పాడైపోయిన ఇళ్లను కొనుగోలు చేసి కచ్చితంగా రిపేర్ చేయించుకోవాలి.. ఆ తర్వాత అందులో నివాసానికి ఉండాలి అనే రూల్ పెట్టారు, చాలా మంది ఆసక్తిగా కొనడానికి వస్తున్నారు.