ఆ కీలక నేత వైసీపీలో ఉన్నా కాంగ్రెస్ భక్తే…

ఆ కీలక నేత వైసీపీలో ఉన్నా కాంగ్రెస్ భక్తే...

0
82

ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి… పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి చొరవతో పోటీ చేసి స్వల్ప మెజారిటతో ఓటమి చెందారు… ఐతే ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ గాంధీ కుటుంబానికి వీర బక్తుడుగానే ఉన్నారు… ఆయన ఎవరో కాదు… ద్రొనమ్ రాజు శ్రీనివాస్… ద్రోనమ్ రాజు కుటుంబానికి కాంగ్రెస్ తో ఐదు దశాబ్దాల అనుబంధం… ద్రోనమ్ రాజు సత్యనారాయణ 1970 కాంగ్రెస్ పార్టీలో చేసి అంచెలంచెలుగా ఎదిగారు… ఇందిరా గాంధీ చొరవతో ఆయన రాజకీయంగా ఎదిగారు… అందుకే ఇందిరా గాంధీ కుటుంబానికి ద్రోనం ఫ్యామిలీ అంత విధేయత చూపుతుంది… నేటి కాలంలో వేదేయతలు విశ్వసనీయతకు కనుమరుగవుతున్న రోజులు ఇవి… అయినా సరే దశాబ్దాల అభిమానాన్ని దృష్టిలో పెట్టుకొని ద్రొనం రాజు శ్రీనివాస్ ఇప్పటి వరకు కాంగ్రెస్ లో కొనసాగారు…ఆయన ఇంట్లో ఇప్పటికీ ఇంధిరా గాంధీ ఫొటోస్ ఉంటాయి… ఇది తన వ్యక్తి గత భక్తి అని అంటారు… తాను ఏపార్టీలో ఉంటే ఆ పార్టీ భక్తు డని కని ఇందిరా.గాంధీ అంటే తమ కుటుంబానికి యెనలేని అభిమానం అంటున్నారు..