ఆ లేడీ టీడీపీ ఎమ్మెల్యేపై పెరుగుతున్న స్వరాలు….

ఆ లేడీ టీడీపీ ఎమ్మెల్యేపై పెరుగుతున్న స్వరాలు....

0
77

ఆదిరెడ్డి భవానీ గత ఏడాది ఎన్నికలకు ముందు ఈపేరు పెద్దగా ఎవరికీ తెలియదు కానీ ఎన్నికల సమయంలో టీడీపీ అభ్యర్థిగా అరంగేట్రం చేశాక దివంగత శ్రీకాకుళం మాజీ ఎంపీ కింజరపు ఎర్రన్నాయుడి కుమార్తె అనే విషయం రాష్ట్ర వ్యాప్తంగా మార్మోగింది… దీంతో ఒక్కసారిగి ఆదిరెడ్డి భవానీకి హైప్ వచ్చింది… ఈమె గత ఎన్నికల్లో రాజమండ్రి నుంచి పోటీ చేసి విజయం సాధించారు… టీడీపీ విజయం సాధించి ఉంటే ఆమెకు మంత్రి పదవి తప్పనిసరిగా వచ్చి ఉండేదని ప్రచారం సాగింది…

అయితే టీడీపీకి అధికారం రాలేదు… పార్టీకి అతి తక్కువ మంది ఎమ్మెల్యేలు మాత్రమే మిగిలారు పైగా ఆమె ఒక్కరే మహిళా ఎమ్మెల్యేగా మిగిలారు దీంతో అసెంబ్లీలో టీడీపీకి మహిళా వాయిస్ వినిపించాలంటే అదిరెడ్డి భవానీ ఒక్కరే…. అధ్యక్షా అని అనాల్సిన పరిస్థితి… తాను కొత్తే అయినప్పటికీ బాబాయి మాజీ మంత్రి అచ్చెన్న దగ్గర పాఠాలు వడివడిగా నేర్చుకుని అసెంబ్లీలో దిశ పోలీస్టేషన్లు సహా మహిళా సమస్యలపై గళం వినిపించారు..

అయితే నియోజకవర్గ విషయానికి వస్తే ఏడాది పూర్తి అయినా ఆదిరెడ్డి ఇంకా పట్టు సాధించలేకపోయారనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి… ఇంతవరకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కటి కూడా నెరవేర్చలేకపోయారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి… ఇది ఇలాగే కొనసాగితే వచ్చే ఎన్నికల నాటికి కష్టమే అని విశ్లేషకులు అంటున్నారు…