వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ లీడర్ కు రాజ్యసభ ఆఫర్ వచ్చింది అని తెలుస్తోంది.. అయితే ఆయన దానికి చాలా ఆనందంగా ఉన్నారట.. గత ఎన్నికల్లో ఆయన అసెంబ్లీ టికెట్ కోరారు.. ఆ సమయంలో ఎమ్మెల్యే అయితే మంత్రి అవ్వచ్చు అని భావించారు.. కాని జగన్ ఆయనకు టికెట్ ఇవ్వలేదు. సీనియర్ కాబట్టి ఆయనకు రాజ్యసభ సీటు ఇస్తాను అని చెప్పారట.
తాజాగా ఆ సీనియర్ నేతకు రాజ్యసభ ఇస్తాను అని చెప్పారు. అయితే సదరు నాయకుడు మాత్రం తనకు ఎమ్మెల్సీ ఇచ్చినా పర్వాలేదు అని చెప్పారట.. దీంతో జగన్ తాను ఇచ్చిన మాట ప్రకారం మీకు రాజ్యసభ ఇస్తాను అన్నారట.. మొత్తానికి జగన్ ఇచ్చి న మాట ప్రకారం తమ నాయకుడికి రాజ్యసభ ఇస్తున్నారు జగన్ అని కేడర్ భావిస్తున్నారు.
అయితే జనవరిలో ఈ కొత్త పేర్లు అనౌన్స్ చేయనున్నారు, రాజ్యసభకు ఎవరిని నామినేట్ చేస్తారు అనేది జగన్ తెలియచేయనున్నారు. పార్టీ తరపున సీనియర్ లీడర్లు చాలా కాలం జగన్ తో ఉన్న నేతలకు కీలక పదవులు ఇవ్వాలి అని జగన్ భావిస్తున్నారట.