ఏపీలో సీఎం జగన్ సంక్షేమ పథకాల అమలులో దూసుకువెళుతున్నారు.. ఆయన ఇచ్చిన నవరత్నాలు ఐదు సంవత్సరాల్లో అమలు చేస్తారు అనుకుంటే, ఆయన ఏడాదిలోనే అమలు చేసి సరికొత్త పథకాలు తీసుకువస్తున్నారు, విద్యార్దుల చదువు పట్ల మరింత శ్రద్ద తీసుకుంటున్నారు, ప్రభుత్వ స్కూళ్ల రూపు రేఖలు మారుతున్నాయి.
అయితే తాజాగా పార్టీకి సేవ చేసిన వారికి అలాగే ప్రజాసేవలో ఉన్న నేతలకు కూడా కీలక పదవులు ఇస్తున్నారు, సీఎం జగన్ ఇటీవల మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ ను రాజ్యసభకు పంపారు సీఎం జగన్
తాజాగా ఆయన తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు.
పార్లమెంట్‍కు వెళ్లాలన్న తన చిరకాల కోరిక నెరవేరిందని మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు. రాజ్యసభకు ఎన్నికైన ఆయన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను మండలి కార్యదర్శికి అందజేశారు. తను మంత్రిగా చేసిన ఏడాది కాలం ఎంతో ఆనందం ఇచ్చింది అని అన్నారు
ప్రజలకు సేవ చేసేందుకు సీఎం జగన్ పూర్తి స్వేచ్ఛ ఇచ్చారని తెలిపారు.