‘దశాబ్దాలుగా కొనసాగుతున్న చరిత్రను తిరగరాసిన యోగి’

0
91

పార్టీని అసెంబ్లీ ఎన్నికల్లో విజయం వైపు నడిపించినందుకు ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా రాష్ట్రాల ముఖ్యమంత్రులకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు తెలంగాణ బీజేపీ అధికార ప్రతినిధి కృష్ణసాగర్ రావు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..పంజాబ్‌లో తొలిసారి కూటమి నాయకుడిగా పోటీ చేస్తున్నందున బీజేపీ ఓట్ల శాతం, సీట్ల వాటా పెరగడం కూడా సంతోషాన్ని కలిగిస్తోంది. ఉత్తరప్రదేశ్‌లో విజయం చాలా ప్రత్యేకమైనది. అక్కడ అనావయితికి బిన్నంగా యుపి ప్రజలు రెండోసారి బీజేపీకి అధికారం కట్టబెట్టారు. దశాబ్దాలుగా కొనసాగుతున్న చరిత్రను యోగి తిరగరాశారు. అధికార వ్యతిరేకతను అధిగమిస్తూ, అధికారంలో ఉన్న అన్ని రాష్ట్రాలను గెలిచి నిలుపుకుంటున్నాం.

ఈ ఫలితాలు బీజేపీ పాలిత రాష్ట్రాలలో అందిస్తున్న సుపరిపాలనకు ఈ ఫలితాలు నిర్ధారిస్తున్నాయి. ఈ విజయం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వానికి భారతదేశ ప్రజల నుండి ప్రాంతాలకు అతీతంగా మద్దతు , ఆశీర్వాదం కూడా. ఈ చారిత్రాత్మకమైన 5 అసెంబ్లీల విజయం ఖచ్చితంగా సిఎం కెసిఆర్ , భారతదేశం అంతటా ఆయనలాంటి రాజకీయ పగటి కలలకు భంగం కలిగిస్తుంది. బీజేపీ అభివృద్ధి ఎజెండాను, ప్రధాని నరేంద్ర మోదీ అద్భుతమైన పాలనను అన్ని ప్రాంతాల భారతీయులు గౌరవిస్తున్నారని ఇప్పుడు స్పష్టమవుతోందన్నారు.