ఆ కీలక నేతను లైట్ తీసుకుందా…

ఆ కీలక నేతను లైట్ తీసుకుందా...

0
96

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరు జిల్లా… ఈ జిల్లాలో చంద్రబాబు నాయుడు పట్టు సాధించాలని చూస్తునే ఉన్నారు… కానీ సాధించలేక పోతున్నారు… ఎప్పుడు ఎన్నికల జరిగినా సరే ప్రజలు వైసీపీకి అండగానే ఉంటున్నారు.. 2014 ఎన్నికల్లో వైసీపీనే మెజార్టీ స్థానాలు గెలుచుకుంది…

ఇక 2019 ఎన్నికల్లో చరిత్ర తిరగరాసింది… టీడీపీ కేవలం చంద్రబాబు నాయుడు పోటీ చేసిన కుప్పం తప్ప మిగిలిన అన్ని స్థానాలను వైసీపీ కైవసం చేసుకుంది… రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ గెలవడంతో జగన్ అధికార పీఠాన్ని దక్కించుకున్నారు… దీంతో టీడీపీ ప్రతిపక్షంలో చేరింది…. ఇకసైకిల్ పుంజుకోవాలంటే కనీసం 20 సంవత్సరాలు పడుతుందనే ఉద్దేశంతో చాలామంది టీడీపీకి గుడ్ బై చెబుతున్నారు…

ఇటీవల కాలంలో టీడీపీ నుంచి వలసలు ఎక్కువ అవ్వడంతో ప్రస్తుతం పార్టీ తీవ్ర ఇరకాటంలో ఉంది.. ఇలాంటి సమయంలో ఆ పార్టీకి మరో చేదు వార్త వినిపిస్తోంది… చిత్తూరు జిల్లాకు చెందిన మరో మాజీ ఎమ్మెల్యే అధిష్టానంపై అలక చెందారట… టీడీపీ ప్రతిపక్షంలో చేరిన తర్వాత తనకు ప్రాధాన్యం తగ్గిందని పలుమార్లు అంతర్గత సమావేశాల్లో వెళ్లడించారు… అయినా కూడా టీడీపీ అధిష్టానం ఆయనను పట్టించుకోకుందట దీంతో ఆ మాజీ ఎమ్మెల్యే వైసీపీలో చేరాలని చూస్తున్నారు…