ఆ నాయకుడి గురించి ఏం చెప్పినా వినను- జగన్

ఆ నాయకుడి గురించి ఏం చెప్పినా వినను- జగన్

0
112

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఓ యువనాయకుడిని సొంత పార్టీలో వారే టార్గెట్ చేశారు అనే వార్తలు వినిపిస్తున్నాయి.. రాయలసీమకు చెందిన ఆ యువనేత పై ఇటీవల అనేక వార్తలు వస్తున్నాయి.. చిన్నతనంలోనే రాజకీయంగా ఇంత పెద్ద స్టేజ్ కు రావడంతో కొందరు సహించలేకపోతున్నారు. మరో ఐదేళ్లు పార్టీలో ఇలాగే ఉంటే మనకు ఈ నేత నుంచి తల నొప్పులు తప్పవు అనేలా ఆలోచిస్తున్నారట కొందరు సీమ నేతలు.

అయితే సీఎం జగన్ మాత్రం ఆ నాయకుడిపై ఎవరు ఎన్ని ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదట, అసలు ఫిర్యాదులు చేసేవారి తప్పులు చూస్తున్నారట జగన్, ఇక పార్టీలో అతనికి పొగపెట్టాలి అని కొందరు ప్రయత్నిస్తున్నారు అని జగన్ ముందుగానే గ్రహించారట. అయితే ఇటీవల ఆయనకు జగన్ ఎమ్మెల్సీ పదవి ఇస్తారు అని వార్తలు రావడంతో, ఒకవేళ జగన్ ఇక ఎమ్మెల్సీ పదవి ఇస్తే,సీమలో మన ఎదుగుదలకు కష్టం అని భావిస్తున్నారట సదరు బ్యాచ్ .

మొత్తానికి జగన్ మాత్రం ఈ సత్యం గ్రహించి ఇలాంటి నేతల ఫిర్యాదులు పట్టించుకోవడం లేదు అని తెలుస్తోంది. అంతేకాదు కడపలో ఓ సీనియర్ నాయకుడికి చెప్పి ఆ యువనేతని కాస్త దూకుడు తగ్గించమని చెప్పారట.