2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోవడంతో ఆ పార్టీ పరిస్థితి గందరగోళంగా మారిందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు…చాలాంది సీనియర్ నేతలు తమ రాజకీయ భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకుని ఇతర పార్టీల్లోకి జంప్ చేసేందుకు సిద్దవుతున్నారు… ఇప్పటికే చాలామంది సీనియర్లు, జూనియర్లు టీడీపీకి గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే..
ఇక పార్టీలో ఉన్న నేతలను కాపాడేందుకు అధిష్టానం అష్టకష్టాలు పడుతోంది.. అయితే ఒక మాజీ ఎమ్మెల్యే విషయంలో మాత్రం టీడీపీ అధిష్టానం అందుకు భిన్నంగా వ్యవహరిస్తుందని వార్తలు వస్తున్నాయి…. 2014 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచి ఆతర్వాత టీడీపీ ప్రలోభాలకు ఆశపడి సైకిల్ ఎక్కారు… టీడీపీ తరపున మంత్రి పదవిని కూడా ఆశించారు కానీ ఆయనకు దక్కలేదు….
ఇక 2019 ఎన్నికల్లో టికెట్ దక్కించుకుని పోటీ చేశారు.. కానీ ఫ్యాన్ గాలికి ఆయన తట్టుకోలేక ఓటమి పాలు అయ్యారు… ఇక టీడీపీ కూడా అధికారం కోల్పోవడంతో ఆ మాజీ నేత పార్టీకి దూరంగా ఉన్నారు… ఈ క్రమంలో ఆయన తిరిగి వైసీపీలో చేరుతారని వార్తలు వస్తున్నాకూడా అధిష్టానం మాత్రం పట్టించుకోకుందట… అంటే ప్రత్యక్షంగా చెప్పకున్నా పరోక్షంగా వెళ్లమని చెప్పినా కూడా వైసీపీ మాత్రం తమకు వద్దేవద్దు అని అంటోందట…