ఆదినారాయణరెడ్డికి ఊహించ‌ని షాక్

ఆదినారాయణరెడ్డికి ఊహించ‌ని షాక్

0
104

తెలుగుదేశం పార్టీ నుంచి బీజేపీలోకి చేరిపోయిన ఆదినారాయణ రెడ్డి కడప జిల్లా నుంచి జమ్మలమడుగు రాజకీయాలకు మాత్రమే పరిమితం అయ్యారు అంటున్నారు అందరూ.. అయితే ఆయన టీడీపీలో కేవలం మంత్రి పదవి కోసమే చేరారు అని విమర్శలు వచ్చాయి.. చివరకు అక్కడ రామసుబ్బారెడ్డి ఫైనల్ గా టీడీపీకి పెద్ద దిక్కు అయ్యారు.

అయితే రాజకీయంగా ఇలా ఉంటే మాజీ ఎంపీ వైయస్ వివేకా హత్య కేసులో సిట్ విచారణ వేగవంతం అయింది.. తాజాగా మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డికి మరోసారి సిట్ నోటీసులు అందాయి.
ఇప్పటికే రెండుసార్లు నోటీసులిచ్చినా విచారణకు ఆదినారాయణరెడ్డి హాజరుకాలేదు.

అయితే కచ్చితంగా నోటీసులు తీసుకుంటే విచారణకు రావాలి అంతేకాదు ఆ విచారణకు ఎందుకు రావడం లేదు అనేది చెప్పాలి కాని ఆదినారాయణ రెడ్డి మాత్రం వెళ్లలేదు.. దీంతో మరోసారి నోటీసులు అందాయి.. సెక్షన్ 160 సీఆర్పీసీ ప్రకారం ఈ నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది. కడప జిల్లా దేవగుడిలోని ఆదినారాయణరెడ్డి ఇంటికి పోలీసులు వెళ్లారు. ఆ సమయంలో ఆదినారాయణరెడ్డి ఇంట్లో లేరని తెలుస్తోంది.