ఆనం పంచాయితీకి ఫుల్ స్టాప్-జగన్

ఆనం పంచాయితీకి ఫుల్ స్టాప్-జగన్

0
86

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని కలిశారు….ఇటీవలే తాను ఎందుకు సంచలన వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందో ఆనం జగన్ కు వివరించారు… ఆయన మాటలను శ్రద్దగావిన్న జగన్ మరోసారి ఇలాంటివి రిపీట్ కాకుండా చూసుకోవాలని సూచించారట…

ఏదైనా సమస్య ఉంటే పార్టీ నేతలకు చెప్పాలని ఇలా మీడియా ముందు తెలియజేయడం మంచిది కాదని అన్నారు… రాజకీయాల్లో సీనియర్ నేతగా ఉన్న మీలాంటి వారు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు జగన్… అంతేకాదు ఆయనంకు సోకాజ్ నోటీసులు జారీ చేయాలన్న ప్రతిపాదనను వైసీపీ ఉపసంహరించుకుంది…

కాగా స్వచ్చమైన తేనె కావాలంటే వెంటగిరికి రావాలని… ఏ ఇతర మాఫియా కావాలన్నా నెల్లూరు నగరానికి వెళ్లండంటూ నెల్లూరు జిల్లాలో ప్రాతినిత్యం వహిస్తున్న అనిల్ అలాగే శ్రీధర్ రెడ్డిలని ఉద్దేశిస్తూ పరోక్షంగా వ్యాఖ్యానించారు ఆనం…