తెలుగుదేశం పార్టీ నుంచి కొందరు నేతలు గోడ మీద పిల్లిలా ఎప్పుడు గోడ దూకుదామా అని చూస్తున్నారు, అయితే పార్టీలోకి వచ్చేందుకు కొందరు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంటే, మరికొందరు మాత్రం కండిషన్లు పెడుతున్నారు.. అయితే నెల్లూరు జిల్లాలో వైసీపీకి ప్రతీ చోటా విజయం వచ్చింది. ఇక్కడ కొత్త వారిని తెచ్చుకున్నా వర్గపోరు మినహ వైసీపీ సాధించేది ఏమీ లేదు. అయితే ఓ మాజీ మంత్రి కోట్ల రూపాయలకు పడగలు ఎత్తిన నేత మాత్రం తన జోలికి రాకుండా ఉండాలని చెబుతున్నాడట.
అంతేకాదు తన వ్యాపారాలను కాపాడుకునేందుకు వైసీపీలోకి వస్తాను అంటున్నాడట.. జిల్లాలో వైసీపీ నేతలు ఒకే అని చెబుతున్నా, జగన్ మాత్రం ఆ నాయకుడ్ని పార్టీలో చేర్చుకునేందుకు సుముఖత చూపించడం లేదట .. గతంలో జగన్ కూడా ఆ మంత్రి పై అనేక ఆరోపణలు చేశారు. అందుకే ఆయనని పార్టీలో తీసుకుంటే అసలుకే ముప్పు వస్తుంది అని జగన్ ఆలోచించారట.
దీంతో ముందు ముందు తన రాజకీయ జీవితం ఎలా ఉన్నా, తన వ్యాపారాలు ఎలా ముందుకు నడుస్తాయి అని భయపడుతున్నాడట. అందుకే బీజేపీ గూటికి చేరాలని సంప్రదింపులు ప్రారంభిచాడట.