ఏబీ వెంకటేశ్వరావు దారిలో మరికొందరు ఉద్యోగులు జగన్ మరో కీలక నిర్ణయం

ఏబీ వెంకటేశ్వరావు దారిలో మరికొందరు ఉద్యోగులు జగన్ మరో కీలక నిర్ణయం

0
95

చంద్రబాబు అధికారంలో ఉన్నసమయంలో ఏబీ వెంకటేశ్వరావు తన ఉద్యోగం కాకుండా ఇతర కార్యక్రమాలు బాగా నిర్వర్తించాడు అని వైసీపీ నాటి నుంచి నేటి వరకూ ఆరోపిస్తూనే ఉంది..బాబు పాలనలో ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ అయ్యారు. ఇంకా చాలా మందిపై చర్యలు తీసుకునే ఆస్కారం ఉంది అని వార్తలు వస్తున్నాయి..

అయితే ఆ సమయంలో చాలా మంది వైసీపీ నేతలని అణగదొక్కాలి అని ప్రయత్నించారట ..అంతేకాదు పార్టీ తరపున ఇరవై మూడు మంది పార్టీ మారిన నాయకులని టీడీపీలోకి మారేలా చేశారు అనే విమర్శలు ఆరోపణలు ఉన్నాయి. అయితే వైసీపీ తాజాగా అలాంటి ఉద్యోగులకి బంపర్ ఆఫర్ ఇస్తోంది అంటున్నారు.

నిజమే ప్రజల కోసం పని చేయాల్సిన ఉద్యోగులు ప్రభుత్వాల కోసం అలాగే ఆ నాయకుల కోసం పని చేస్తే ఎలా అనే విమర్శలు సాధారణ జనం నుంచి వినిపిస్తున్నాయి…చంద్రబాబు మాత్రం ఏబీని వెనకేసుకువస్తున్నారు.. కాని కొందరు టీడీపీ నేతలు దీనిని వ్యతిరేకిస్తున్నారు, బాబు చేస్తుంది కరెక్ట్ కాదు అంటున్నారు, అయితే ఏబీనే కాదు మరికొందరు ఉద్యోగులు త్వరలో బయటకు వస్తారు అంటున్నారు.. చాలా మంది ఉన్నత ఉద్యోగులు వీరి గురించే చర్చించుకుంటున్నారు, అందుకే ప్రభుత్వాలు పార్టీలు ఇప్పుడు ఉంటాయి తర్వాత మారతాయి.. ఉద్యోగులు ప్రజల కోసం పని చేయాలి అంటున్నారు మేధావులు.