అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు

అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు

0
32

ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి రాజధానిపై తీసుకున్న నిర్ణయం పై చాలా మంది అభ్యంతరాలు తెలుపుతున్నా రు …అయితే వైసీపీ నేతలు మాత్రం దీనిని స్వాగతించారు.. ఏకంగా మెగాస్టార్ చిరంజీవి కూడా జగన్ నిర్ణయాన్ని స్వాగతించారు.. అయితే రాజధాని ఒకే చోట పెడితే డవలప్ మెంట్ అన్నీ ప్రాంతాల్లో జరగదు అని, మూడు చోట్లా ఉంటే డవలప్ మెంట్ జరుగుతుంది అని చెబుతున్నారు వైసీపీ నేతలు.

అయితే తాజాగా దీనిపై ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. నిట్ స్నాతకోత్సవంలో మాట్లాడుతూ కొన్ని వ్యాఖ్యలు చేసారు. .అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి. అన్నీ ఒకేచోట పెట్టడం మంచిది కాదు. రాజధానిలో అన్నీ ఉంటే మిగతా ప్రాంతాల అభివృద్ధి జరగదు అని అన్నారు.

మొత్తానికి నీట్ కార్యక్రమం కాబట్టి దానిని ఉద్దేశించి చెప్పి ఉండవచ్చు.. కాని ఇక్కడ మాత్రం ఆయన మాటలు రాజధానికి అని అందరూ భావిస్తున్నారు. గత తప్పులు సరిచేస్తూ జగన్ ఆంధ్రలోని మూడు ప్రాంతాలకు సమాన న్యాయం చేయాలనుకుంటున్నారు. సో తాజాగా ఉప రాష్ట్రపతి చేసిన వ్యాఖ్యలు కూడా ఏపీలో వైరల్ అవుతున్నాయి.