ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం నేతలు కౌంటర్లు వేస్తారు.. పలు విమర్శలు చేస్తారు అనేది తెలిసిందే, అయితే తాజాగా ట్విట్టర్ వేదికగా టీడీపీ నేత అచ్చెన్నాయుడు సెటైర్లు వేశారు. జగన్ కంపెనీ షేర్లను కొనడానికి శ్రీనివాసన్ ఎవరంటూ అచ్చెన్నాయుడు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
నీ కంపెనీ షేర్లను రూ.1440 లకు కొనడానికి శ్రీనివాసన్ నీకు మామనా? లేదా నీ మరో మేనమామనా? ఒక్కో షేర్‌కు అంత ధర పెట్టి నీ మామ గంగిరెడ్డే కొనలేదు. ఇక నీ మేనమామ రవీంద్రనాథరెడ్డి కోనేరకం ఎటూ కాదు. మరి ఈ దొంగ మామ అంత రేటుకు ఎలా కొన్నాడు?
సీబీఐ భారతి సిమెంట్ తీగ లాగింది. ఈడీ దెబ్బకు నీ డొంకలన్నీ కదిలాయా జగ్గు దాదా’’ అని అచ్చెన్నాయుడు ట్వీట్‌లో పేర్కొన్నారు. మొత్తానికి దీనిపై వైసీపీ నేతలు అచ్చెన్నపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.