అచ్చెన్నాయుడు ప్రమాదం తీవ్ర గాయాలు

అచ్చెన్నాయుడు ప్రమాదం తీవ్ర గాయాలు

0
76

ఏపీ మాజీ మంత్రి సిక్కోలు సీనియర్ టీడీపీ నాయకులు అచ్చెన్నాయుడు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురి అయింది.. ఈ వార్త ఇప్పడుు టీడీపీ నేతలను కలవర పాటుకి గురిచేసింది.. మా అచ్చెన్నకు ఏమైంది అని టీడీపీ నేతలు అందరూ కంగారు పడ్డారు.

విశాఖ జిల్లా నక్కపల్లి హైవే మీద ఆయన కారు డివైడర్‌ను ఢీకొట్టి రోడ్డుపక్కకు దూసుకెళ్లినట్టు తెలిసింది. ఈ ప్రమాదంలో అచ్చెన్నాయుడు, కారు డ్రైవర్, ఎమ్మెల్యే గన్‌మెన్ ఉన్నారు. బాధితులను వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. వారికి తీవ్ర గాయాలు అయ్యాయి, వారి కారు చాలా నెమ్మదిగానే వెళుతోంది అని డివైడర్ ను ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది అని తెలియచేశారు.

ఇక కారులో ఉన్న మాజీ మంత్రి అచ్చెన్నాయుడు చేతికి గాయమైంది.ఆయనకు చికిత్స అందించారు..అయితే, ప్రమాదం ఏదీ లేదని అచ్చెన్నాయుడుకి తెలిపారు డాక్టర్లు . చికిత్స తర్వాత ఆయన మరో కారులో ఇంటికి వెళ్లారు. ఆయనకు నారాలోకేష్ చంద్రబాబు ఫోన్ చేసి ఆరోగ్యం ఎలా ఉంది అని పరామర్శించారని తెలుస్తోంది.