అదంతా తప్పు నేను అలా అనలేదు చిరంజీవి క్లారిటీ

అదంతా తప్పు నేను అలా అనలేదు చిరంజీవి క్లారిటీ

0
95

మెగాస్టార్ చిరంజీవి ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయం స్వాగతించిన విషయం తెలిసిందే … అయితే పవన్ ఓ దారి నాగబాబు ఓ దారి మెగాస్టార్ చిరంజీవి ఓదారి అని అనేక కామెంట్లు వచ్చాయి.. కాని చిరంజీవి మాత్రం తన నిర్ణయానికి కట్టుబడి ఉన్నారు.. శనివారం ఆయన ఆ ప్రకటన చేశారు.

కాని ఆదివారం ఆయన పేరుతో మరో ప్రకటన వచ్చింది.నేనిప్పుడు రాజకీయాలకు దూరంగా ఉన్నా. మూడు రాజధానుల అంశంపై సమర్థిస్తూ కానీ, వ్యతిరేకిస్తూ కానీ ఎటువంటి ప్రకటన చేయలేదు అని చిరంజీవి పేర్కొన్నట్టు నిన్న సోషల్ మీడియాలో ఓ ప్రకటన చక్కర్లు కొట్టింది, ఇది వాస్తవం కాదు అని ఆయన తెలియచేశారు.

తాను జగన్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాను అని చిరంజీవి తెలియచేశారు. మూడు రాజధానులను సమర్థిస్తూ శనివారం విడుదల చేసిన ప్రకటన మాత్రమే వాస్తవమని తెలిపారు చిరంజీవి. మొత్తానికి సోషల్ మీడియాలో వస్తున్న వార్తలతో ఏది వాస్తవం ఏది అవాస్తవం అనేది మాత్రం తెలియడం లేదు.