ఎడారి మిడతల గురించి నమ్మలేని నిజాలు

ఎడారి మిడతల గురించి నమ్మలేని నిజాలు

0
50

ఇప్పుడు ఎక్కడ సోషల్ మీడియాలో చూసినా ఈ ఎడారి మిడతల గురించే వార్తలు వినిపిస్తున్నాయి, పంటలను ఇవి ఎలా తినేస్తున్నాయో రైతుల కష్టాలు టిక్ టాక్ ఫేస్ బుక్ లో చాలా వీడియోలు కనిపిస్తున్నాయి, మన తెలుగు స్టేట్స్ పై కూడా ఇవి దాడి చేసే అవకాశం ఉందని, అందుకే వీటిని ఎదుర్కొనేందుకు తరిమి కొట్టేందుకు అధికారులు సిద్దం అయ్యారు.

ప్రస్తుతం 17 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఒక మిడతల గుంపు మహారాష్ట్రలోని అమరావతి సమీపంలోకి చేరుకుంది. అసలు ఈ మిడతలు గత ఏడాది ఆఫ్రికా ఖండంలో మొదలయ్యాయి, అక్కడ నుంచి అరేబియా, పాకిస్తాన్ దాటి భారత్ కు చేరుకున్నాయి, వీటికి పంటలు పచ్చని చెట్లు అంటే ఇష్టం, పచ్చని తోటని సైతం నెలలో ఖాళీ చేస్తాయి సమూహంగా వెళితే.

ఏప్రిల్ 11వ తేదీన పాక్ నుంచి భారత్ లోకి ప్రవేశించింది ఈ దండు . రాజస్థాన్ రాష్ట్రంలోని సగం జిల్లాలకు విస్తరించాయి. అక్కడ వేల హెక్టార్లలో పంటలను నాశనం చేశాయి. అక్కడ నుంచి పలు రాష్ట్రాకు చేరి పంటలు తినేస్తున్నాయి. వీటిని చెదరగొట్టేందుకు రాజస్థాన్ లోని జోధ్ పూర్ లో వ్యవసాయ అధికారులు డ్రోన్లను వినియోగిస్తున్నారు. వీటి ద్వారా రసాయనం చల్లుతున్నారు. ఎడారి మిడత బరువు 2 గ్రాములు ఉంటుంది.. వీటి పొడవు 2 – 3 అంగుళాలు ఉంటుంది., వీటి జీవితకాలం 3 – 6 నెలలు ఉంటుంది. ఈ మిడతలు దండులో ఉండే సంఖ్య 4 – 8 కోట్లు ఉంటాయి.