ఎంతపని సేత్తివి ఆదినారాయణ రెడ్డి

ఎంతపని సేత్తివి ఆదినారాయణ రెడ్డి

0
84

2019 ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని తెలుగుదేశం పార్టీ నాయకులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాత్రీ పగలు అన్న తేడా లేకుండా ప్రచారం చేశారు. ఈక్రమంలో మరోసారి అధికారంలోకి వచ్చి రికార్డ్ బద్దలు కొట్టాలని చంద్రబాబు నాయుడు చూసినప్పటికీ  ప్రజలు మాత్రం వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డికే పట్టంకట్టారు..

కళ్లు మూసి తెరిసేలోపు వందరోజుల పరిపాలనకూడా విజయవంతం చేశారు. గెలుపే క్ష్యంగా చేసుకుని పనిచేసిన చంద్రబాబు నాయుడు తన రాజకీయ చరిత్రలో ఇంత ఘోరమైన ఓటమి ఎప్పుడు చూడలేదు.

ఇక ఈ ఫలితాలను ద్రష్టిలో ఉంచుకుని తమ్ముళ్లు ఎవరిదారి వారు చూసుకుంటున్నారు… మరో ఐదేళ్లవరకు టీడీపీ పుంజుకునే అవకాశం లేదు. ఆ తరువాత దఫా కూడా పుంజుకోవడం గాళ్లోమాటే అని గ్రహించి తమ్ముళ్లు టీడీపీకి గుడ్ బై చెబుతున్నారు… చాలామంది టీడీపీ నాయకులు కేంద్రంలో ఉన్న బీజేపీవైపు చూస్తున్నారు.

అయితే ఇప్పటికే నలుగు రాజ్యసభ సభ్యులు బీజేపీ తీర్ధం తీసుకున్న సంగతి తెలిసిందే ఇక ఇదే క్రమంలో మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి బీజేపీ చేరేందుకు సిద్దమయ్యారు. గత ఎన్నికల్లో కడప ఎంపీగా పోటీ చేసి ఓటమి చెందిన ఆదినారాయణ రెడ్డి త్వరలో బీజేపీలో చేరనున్నారు.

ఈ విషయాన్న ఆయనే తాజాగా ప్రకటించడం విశేషం.. తన సన్నిహితులతో చర్చించిన తర్వాత మంచి ముహూర్తం చూసుకుని బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నారు.