మళ్లీ స్వ‌ల్ప లాక్ డౌన్ – ముఖ్య‌మంత్రుల‌కి ప్ర‌ధాని స‌ల‌హా

మళ్లీ స్వ‌ల్ప లాక్ డౌన్ - ముఖ్య‌మంత్రుల‌కి ప్ర‌ధాని స‌ల‌హా

0
82

దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ఇక లేన‌ట్టే అని అంద‌రూ భావిస్తున్నారు, అయితే మూడు నెల‌లు లాక్ డౌన్ లో ఉంది భార‌త్.. ఇక జూన్ నుంచి కొన్ని రంగాలు నెమ్మ‌దిగా ప్రారంభం అయ్యాయి, అయితే దేశంలో క‌రోనా కేసులు నాటితో పోలిస్తేనేడు భారీగా పెరుగుతున్నాయి, ఇప్పుడు 90 వేల కేసులు న‌మోదు అవుతున్నాయి రోజుకి.

ఈ స‌మ‌యంలో కేసులు ఎక్కువ న‌మోదు అవుతున్న రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌తో నిన్న మోదీ వీడియో కాన్ఫరెన్స్ ను నిర్వహించారు, ఈ స‌మ‌యంలో స్వల్ప కాల వ్యవధుల్లో మరోమారు సంపూర్ణ లాక్ డౌన్ ను విధించే అంశాన్ని అన్ని రాష్ట్రాలూ పరిశీలించాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు.

క‌రోనా ఎవరిలో ఉందన్న విషయాన్ని ట్రేస్ చేయాలంటే, మరోమారు లాక్ డౌన్ ను విధిస్తే బాగుంటుందని, ఈ విషయమై రాష్ట్రాల ప్రభుత్వాలే నిర్ణయం తీసుకోవాల్సి వుంటుందని మోదీ సూచించినట్టు తెలుస్తోంది. అయితే దేశంలో పూర్తిగా మ‌రోసారి లాక్ డౌన్ ఉండ‌దు.. కాని రాష్ట్రాలు తరచుగా 1 నుంచి 2 రోజుల లాక్ డౌన్ ను రాష్ట్రాల్లో కఠినంగా అమలు చేస్తే వైర‌స్ ఎవ‌రిలో ఉందో తెలుస్తుంది అంటున్నారు..మహారాష్ట్ర, ఏపీ, కర్ణాటక, ఉత్తర ప్రదేశ్, తమిళనాడు, ఢిల్లీ, పంజాబ్ ముఖ్య‌మంత్రులు ఈ స‌మావేశంలో పాల్గొన్నారు, మ‌రి చూడాలి ఆయా రాష్ట్రాలు ఏ నిర్ణ‌యాలు తీసుకుంటాయో.