కోమ‌టిరెడ్డికి కీలక బాధ్యతలు అప్పగించిన ఏఐసీసీ..

0
102

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఘోరంగా ఓడిపోయి..టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి‌ రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్య‌మంలో కీల‌క పాత్ర పోషించి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి టీపీసీ మంచి రేసులో ఉన్నాడు. తెలంగాణ మునిసిప‌ల్ ఎన్నిక‌ల్లో తమ అభ్యర్థులను గెలిపించి కాంగ్రెస్ నేతగా మంచి పేరు దక్కించుకున్నాడు.

అయితే ఈ సందర్బంగా..కీలక నేత, మాజీ మంత్రి, నల్లగొండ ఎంపీ అయినటువంటి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఏఐసీసీ కీలక బాధ్యతలు అప్పగించింది. 2023 శాసన సభ ఎన్నికల స్టార్ క్యాంపెయినర్‌గా కోమటిరెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం నియమించింది. ఈ మేరకు ఆదివారం శ్రీరామ నవమి పండుగ సందర్భంగా ఏఐసీసీ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. టీపీసీసీ పదవి కోసం తీవ్ర ప్రయత్నాలు చేసి, నిరాశ చెందిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఎట్టకేలకు ఆ స్థానం దక్కడంతో వెంకట్ రెడ్డి అభిమానులు సంతోషంలో ఉన్నారు. ఈ శుభవార్తతో కాంగ్రెస్ అభ్యర్థులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.