మాజీ మంత్రి ఈటల రాజేందర్ బిజెపిలో చేరేందుకు ఢిల్లీ వెళ్లడంపై కాంగ్రెస్ నేత, ఎఐసిసి అధికార ప్రతినిధి డాక్టర్ దాసోజు శ్రవణ్ స్పందించారు. ఈటల తోడేళ్ళ దాడి నుంచి తప్పించుకోడానికి, ఆత్మరక్షణ కోసం బిజెపిలో చేరేందుకు ఢిల్లీకి వెళ్ళారని వ్యాఖ్యానించారు. అయితే బిజెపిపై ఈటలకు ప్ర్రేమ ఉండి ఆ పార్టీలో చేరినట్లు అనుకోవాల్సిన అవసరం లేదన్నారు. కేసీఆర్ పోలీస్, రెవెన్యూ అధికారులతో ఈటలపై ఒత్తిడి పెంచాడని ఆరోపించారు. అందుకే దాన్ని తప్పించుకోడానికి ఈటెల ప్రయత్నం చేస్తున్నాడని అన్నారు.
కేసీఆర్ ఆధిపత్యం కోసం.. ఈటెల తోపాటు ఆయన భార్య జామున, కొడుకు, కోడలిపై కూడా కేసులు పెడుతున్నారని ఆరోపించారు. టిఆర్ఎస్ ఫక్తు రాజకీయ పార్టీ కాకుండా ఫక్తు ఫాల్తూ పార్టీ గా మారిందని విమర్శించారు.
తెలంగాణ ఉద్యమకారులపై దాడి చేసినోళ్లే ఇప్పుడు మంత్రులయ్యారని అన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఏడు సంవత్సరాల్లో ఏం సాధించామో అర్ధం కావడం లేదన్నారు. టిఆర్ఎస్ దాడి నుండి తప్పించుకోడానికి కేంద్రంలో వున్న బిజెపి వైపు ఈటెల చూస్తున్నారని స్పష్టం చేశారు.