కరోనా అంటే కేసీఆర్ కి కామెడీనా ? పారసిటమాల్, డోలో పేర్లతో మజాక్

0
88

తెలంగాణ సిఎం కేసీఆర్ తీరు బాధ్యతారాహిత్యానికి పరాకాష్ట అని ఎఐసిసి అధికార ప్రతినిధి డాక్టర్ దాసోజు శ్రవణ్ విమర్శించారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కేసిఆర్ తీరుపై మండిపడ్డారు. ఆయన ఇంకా ఏమన్నారో చదవండి.

కరోనా లేదని ప్రజల జీవితాలతో చెలగాటం ఆడిన కేసీఆర్ సర్కార్ తీరు దుర్మార్గం. కరోనా పై కేసీఆర్ సర్కార్ తప్పుడు లెక్కలు బయటపెడతాము.”పారసిటమాల్” తో ఫస్ట్ వేవ్ ని కేసిఆర్ అపహాస్యం చేశారు. కేసీఆర్ చేసిన అపహాస్యానికి లక్షల మంది తెలంగాణ ప్రజలు మూల్యం చెల్లించుకున్నారు. అసలు కరోనా లేదంటూ నేడు ”డోలో” పేరు చెబుతున్నారు. కేసీఆర్ కి కరోనా అంటే మజాక్ అయితుందా?

కరోనా రెండో దశని ఎదుర్కొవడంలో కేసీఆర్ ప్రభుత్వం పూర్తి విఫలమైంది. తప్పుడు లెక్కలు చెప్పి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడిన కేసీఆర్ సర్కార్. ప్రజలని అప్రమత్తం చేయాల్సిన ప్రభుత్వం కరోనా లేదని చెప్పి ఆపదలోకి నెట్టింది. కేసీఆర్ సెకెండ్ వేవ్ నుండి కూడా పాఠాలు నేర్చుకోలేదు. అసలు కరోనానే లేదని ప్రజలని ఇంకా ప్రమాదంలో నెడుతున్నారు. కేసీఆర్ కి ఇంత భాద్యతరాహిత్యం తగదు. కరోనా లేకపోతే మంత్రి కేటీఆర్, డ్రగ్స్ యాక్ట్ ని అతిక్రమించి మరీ ట్విట్టర్ వేదికగా రెమిడిసివిర్, బ్లాక్ ఫంగస్ మందులు ఎందుకు పంపిణీ చేశారు?

ఒక్క ఖమ్మంలోనే 1420మంది పిల్లలకి కరోనా సోకింది. ఈ సంఖ్య పెరిగే అవకాశం వుందని డాక్టర్లు, శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. కానీ కేసీఆర్ థర్డ్ వేవ్ రాదని తేల్చారు. కరోనా థర్డ్ వేవ్ రాదని ఏ ప్రాతిపాదికపైన కేసీఆర్ చెబుతున్నారు ?