మంత్రి కిషన్ రెడ్డి గురువింద గింజ నీతులు ఆపాలి

-

1. కిషన్ రెడ్డి గురువింద గింజ నీతులు. బిజెపి నాయకులు పరాన్నజీవనం మానుకోవాలి: ఏఐసీసీ అధికార ప్రతినిధి డా. దాసోజు శ్రవణ్

- Advertisement -

2. బిజెపి ద్వందవైఖరిని ఎండగట్టిన దాసోజు శ్రవణ్. ఎల్ కే అద్వానీ, మురళీమనోహర్ జోషి లాంటి పార్టీ వ్యవస్థాపక నాయకులని అవమానించిన బిజెపి .. కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడటం విడ్డూరం.

3. బిజెపి తీరు చూస్తుంటే భవిష్యత్ లో సోనియా గాంధీ వారసత్వ ప్రతిష్టకు బిజెపినే హక్కుదారుని చెప్పినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు.

”కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి గురువింద గింజ నీతులు మానుకోవాలి. భారతీయ జనతా పార్టీ నాయకులు పరాన్నజీవులుగా మారారని ఎద్దేవా చేశారు ఏఐసీసీ అధికార ప్రతినిధి డా. దాసోజు శ్రవణ్. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి కిషన్ రెడ్డి, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పై చేసిన ట్వీట్ కు కౌంటర్ ఇచ్చారు దాసోజు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా ఆయకి నివాళి అర్పించడానికి కూడా రాహుల్ గాంధీకి సమయం లేకుండపొయిందని, పీవీని రాహుల్ గాంధీ విస్మరించారని ట్వీట్ చేశారు కిషన్ రెడ్డి.

‘కిషన్ రెడ్డి చేసిన ట్వీట్ పై కౌంటర్ ఇచ్చిన దాసోజు శ్రవణ్.. బిజెపి నాయకులని పరాన్నజీవులతో పోల్చారు. ఎంతసేపు పీవీ, సర్దార్ వల్లబాయ్ పటేల్ లాంటి కాంగ్రెస్ మహానాయకుల క్రిడిట్ ని ఖాతాలో వేసుకోవాలని చూస్తున్న బిజెపి నాయకులు.. ముందు అద్వానీ, మురళి మొనోహర్ జోషి లాంటి సీనియర్లని ఎందుకు అంటరానివారుగా పక్కకు జరిపారో చెప్పాలి. గురివింద తన కింద నలుపు ఎరగనట్లు కిషన్ రెడ్డి గురువింద గింజ నీతులు చెబుతున్నారని మండిపడ్డారు దాసోజు.

”బిజెపి నాయకులు మొదట చరిత్ర గురించి తెలుసుకోవాలి. పివిని ప్రధాని చేయడంలో సోనియా గాంధీ కీలక పాత్ర పోషించిన సంగతి బిజెపి నాయకులు మర్చిపోయినట్లు వున్నారు. పీవీ శత జయంతి ఉత్సవాలని కాంగ్రెస్ పార్టీ ఏడాది కాలంగా ఘనంగా నిర్వహిస్తుంది. ఈ వాస్తవలన్నీ మర్చిపోయి కిషన్ రెడ్డి చాలా భాద్యతరాహిత్య మైన ట్వీట్ చేశారు. బిజెపి నాయకుల తీరు చూస్తుంటే భవిష్యత్ లో సోనియా గాంధీ వారసత్వ ప్రతిష్టకు బిజెపినే హక్కుదారుని చెప్పినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు.” అని చెప్పుకొచ్చారు దాసోజు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

వైసీపీ హయాంలో అభివృద్ధి శూన్యం.. ప్రధాని మోదీ తీవ్ర విమర్శలు..

వైసీపీ ప్రభుత్వంలో అవినీతి ఫుల్ స్పీడ్‌లో ఉండగా, అభివృద్ధికి బ్రేక్ పడిందని...

జగన్‌ పాలనపై రేణుకాచౌదరి తీవ్ర విమర్శలు

ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై తెలంగాణ సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు, రాజ్యసభ...