ఉద్యమకారుడి నుంచి దోపిడీదారుడిగా మారిన కేసీఆర్

0
100

తెలంగాణ సిఎం కేసిఆర్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు ఎఐసిసి అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్. గాంధీభవన్ లో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో భూముల అమ్మకాలపై విమర్శల వర్షం కురిపించారు. ఆయనేమన్నారంటే…

”గత ప్రభుత్వం భూములు అమ్మలేదా ? అని మంత్రి హరీష్ రావు మాట్లాడుతూతున్నారు. హరీష్ రావు మాటలు వింటుంటే టీఆర్ఎస్ నాయకులందరికీ అల్జీమర్స్ వ్యాధి వచ్చినట్లుందనిపిస్తుంది. గతంలో చేసిన పనులు ఏమీ గుర్తుకు రావడం లేదు టీఆర్ఎస్ నాయకులకు. కాంగ్రెస్ హాయంలో, కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా వునప్పుడు 2012లో లాండ్ మ్యానేజ్మెంట్ అధారిటీ ఏర్పాటు చేస్తూ 571 జీవోని తీసుకొచ్చింది.

వనరులు సమకూర్చుకోవడం కోసం, ఆదాయం కోసం ప్రభుత్వ భూములు అమ్మడానికి లేదు. అలాగే ప్రభుత్వం ఏదైనా లక్ష్యం కోసం భూమి కేటాయించినపుడు ఆ లక్ష్యం నెరవేరకపొతే కేటాయించిన భూమిని ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుందని ఈ జీవోలో స్పష్టంగా పొందుపరిచారు. ప్రభుత్వ భూములు కాపాడాలనే ఉద్దేశంతో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో నిజాయితీగా ఈ జీవో తీసుకొచ్చింది. టీఆర్ఎస్ ప్రభుత్వం ఇది ఏపీ జీవో అని కొట్టిపారేయొచ్చు.

కానీ అధికారంలో వచ్చిన తర్వాత 2015లో జీవో61ని తీసుకొచ్చింది టీఆర్ఎస్ ప్రభుత్వం. విభజన చట్టంని అనుసరించి ఉమ్మడి ఏపీలో చేసిన 571 జీవో స్వీకరిస్తూ అందులోని అంశాలనే జీవో61 లో పొందుపరిచారు. కానీ ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన జీవోనే తుంగలో తొక్కుతూ భూములు అమ్ముకొని ఖజానా నింపుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అసలు టీఆర్ఎస్ ప్రభుత్వానికి సిగ్గుందా? మీరు తీసుకొచ్చిన జీవోనే ఎందుకు అమలు చేయడం లేదు. ఇందుకింత వ్యాపార ధోరణి ప్రవర్తిస్తున్నారు. ఒక ఉద్యమకారుడి నుండి ఒక దోపిడీదారుడిగా మారిన తీరు కేసీఆర్ లో స్పష్టంగా కనిపిస్తుంది” అని విమర్శించారు దాసోజు.