కరోనా భయం ప్రజల్ని చాలా బయపెడుతోంది, ఎక్కడో ఉండే కంటే ఇంటి పట్టున ఉండి గంజి తాగడం మేలు అనుకునే వారు చాలా మంది ఉన్నారు, ఇక ఈ కరోనా బెంబెలెత్తిస్తోంది జనాలని, ఈ సమయంలో ఆస్తులు కాపాడుకోవాలి అని కొందరు, ఉన్నవి అమ్మి అయినా బతకాలి అని మరికొందరు ఆలోచిస్తున్నారు.
కొందరు డబ్బు లేక బంగారం వ్యాపారుల దగ్గర తాకట్టు పెట్టి, ఆ డబ్బుతో నిత్య అవసరాలు తెచ్చుకుని జీవనం గడుపుతున్నారు. ఇక ఓ దేశంలో ప్రజలు ఏం చేస్తున్నారో తెలిస్తే మతిపోతుంది,
థాయ్లాండ్ ప్రజలు కూడా ఈ వైరస్ ప్రభావం ఎదుర్కొంటున్నారు. వారికి ఉద్యోగాలు పనులు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు.
థాయ్లాండ్ ప్రజలు నగదు లేక ఇబ్బంది పడుతున్నారు… దీంతో తమ దగ్గరున్న బంగారాన్ని అమ్మేస్తున్నారు. దానికి తోడు బంగారం రేటు పెరగడంతో చాలా వరకూ బంగారం అమ్మేస్తున్నారు.
బ్యాంకాక్లోని చైనాటౌన్లోని యోవారత్కు ప్రజలు పరుగులు పెడుతున్నారు.ఆ దేశ ప్రధాని ప్రయూత్ చాన్-ఓచా పిలుపునిచ్చారు ఇలా బంగారం ఒకేసారి అమ్మితే నగదు సంక్షోభం వస్తుంది అని అన్నారు, రేటు ఎక్కువ ఉండటంతో జూవెలరీ షాపుల ముందు జనం బారులు తీరారు