అక్క‌డ పెళ్లిళ్లు తెగ చేసుకుంటున్నారు ఎందుకో తెలుసా

అక్క‌డ పెళ్లిళ్లు తెగ చేసుకుంటున్నారు ఎందుకో తెలుసా

0
110

చైనాలోని పుట్టిన ఈ వైర‌స్ ఇప్పుడు ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తోంది, సుమారు 16 ల‌క్ష‌ల మందికి పాకింది 80 వేల మంది మ‌ర‌ణించారు అగ్ర‌రాజ్యం స్పెయిన్ ఇట‌లీ వ‌ణికిపోతున్నాయి, అయితే వైర‌స్ పుట్టిన చైనాలో కూడా ఈ వైర‌స్ వ‌ల్ల వారు మూడు నెల‌లు ఇబ్బంది ప‌డ్డారు.

అడుగు బ‌య‌ట పెట్ట‌లేదు.. జనవరి 23 నుంచి ఏప్రిల్ 7 వరకు వూహాన్ ప్రజలు లాక్‌డౌన్‌లో ఉన్నారు. ఏప్రిల్ 7న ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడంతో తర్వాతి రోజు లాక్‌డౌన్‌ను తొలగించింది చైనా ప్రభుత్వం. అయితే ఇప్పుడు అక్క‌డ జ‌నం సాధార‌ణ లైఫ్ మ‌ళ్లీ స్టార్ట్ చేశారు.

ఈ లాక్‌డౌన్ సమయంలో వూహాన్‌లో ఒక్క వివాహం కూడా జరుగలేదు. ఎప్పుడైతే లాక్‌డౌన్ తీసేస్తున్నారని తెలిసిందో ఒక్కసారిగా వివాహ జంటలు పెండ్లికి దరఖాస్తు చేసుకోవడం మొదలుపెట్టారు.
ఇక చైనాలోని పెళ్లికి ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి, దీంతో ఆ వెబ్ సైట్ కు 300 శాతం ట్రాఫిక్ పెరిగిపోయింది.