బ్రేకింగ్ …..కేంద్రం ఈ ఉద్యోగుల‌కి గుడ్ న్యూస్

బ్రేకింగ్ .....కేంద్రం ఈ ఉద్యోగుల‌కి గుడ్ న్యూస్

0
35

ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మన భార‌త దేశంలో ఇది చాలా పెద్ద బ‌రువు బాధ్య‌త‌లు మోస్తుంది. దేశంలో ప్ర‌తీ పంట వీరి నుంచి బ‌య‌ట‌కు వ‌స్తుంది, అయితే తాజాగా వీరికి గుడ్ న్యూస్ చెప్పింది కేంద్రం.
ఎఫ్‌సీఐ అధికారులు, కార్మికులు . లాక్‌డౌన్ నేపథ్యంలో మార్చి 24 నుంచి విధుల్లో ఉన్న వారు ఎవరైనా కరోనా వైరస్ కారణంగా మరణిస్తే ఒక్కొక్కరికి రూ. 35 లక్షల చొప్పున జీవిత బీమా సౌకర్యం కల్పిస్తున్నట్టు కేంద్రమంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ తెలిపారు.

ఎఫ్‌సీఐలో లక్ష మందికిపైగా పనిచేస్తున్నారు. వీరిందరికీ ఇప్పుడు బీమా రక్షణ లభించనుంది. ఇప్ప‌టికే పుణేలో కూడా అక్క‌డ కార్పొరేష‌న్ ఇలాంటి నిర్ణ‌యం తీసుకుంది, అక్క‌డ మేయ‌ర్ ఇదే విష‌యం చెప్పారు, ఇక డాక్ట‌ర్ల‌కు కూడా ఇదే విధంగా ఇన్సూరెన్స్ క‌ల్పిస్తున్నారు.

దేశంలో కూడా ఇప్పుడు క‌రోనాకి వైద్యం చేసే డాక్ట‌ర్లు న‌ర్సుల‌కి ల్యాబ్ టెక్నిషియ‌న్ల‌కు బీమా క‌ల్పిస్తున్నారు. ఇక ఇప్ప‌టి నుంచి ఆరు నెల‌ల వ‌ర‌కూ క‌రోనా వైర‌స్ తో ఎవ‌రికి అయినా ఈ ప్ర‌మాదం వ‌స్తే బీమా క‌ల్పించ‌నుంది.