కరోనా కేసులు దేశంలో వేగంగా పెరుగుతున్నాయి.. రోజుకి మూడు లక్షలకు పైగా కేసులు నమోదు అవుతున్నాయి …ఏకంగా మూడు వేల మరణాలు వస్తున్నాయి …అయితే కొన్ని స్టేట్స్ లో దారుణమైన పరిస్దితి ఉంది.. మన దేశంలో అత్యధిక కేసులు మహారాష్ట్రలో నమోదు అవుతున్నాయి…అయితే తాజాగా ఓ కీలక విషయం తెలుస్తోంది..
ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే. జులై, ఆగస్టులో రాష్ట్రాన్ని కొవిడ్ మూడో వేవ్ ముంచెత్తే ప్రమాదం ఉందని తెలిపారు… చాలా జాగ్రత్తగా ఉండాలి అని తెలిపారు… ఎపిడెమియాలజిస్టులు ఇచ్చిన నివేదిక ఆధారంగానే ఈ నిర్ధారణకు వచ్చామన్నారు.
అధికారులకి కూడా ఈ విషయం తెలిపారు, ఇక మౌలిక వసతులు ఆస్పత్రులు బెడ్లు ఇలా అన్నీ సమకూర్చుకోవాలి అని తెలిపారు.. ఆక్సిజన్ నిల్వలకు సంబంధించి స్వయం సమృద్ధి సాధిస్తామని రాష్ట్ర ఆరోగ్య మంత్రి రాజేశ్ తోపె చెప్పారు. జులై నాటికి ఆక్సిజన్ మిగులు ఉండాలని తెలిపారు. మే చివరి నాటికి కేసులు తగ్గుతాయి ఆ తర్వాత మళ్లీ జూలై లేదా ఆగస్టుకి కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తుంది అని తెలిపారు.