ఇప్పటికే మోడీ సర్కార్ ఎన్నో పథకాలను రైతుల కోసం తీసుకొచ్చారు. వీటిలో ముఖ్యంగా ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం మీద ఆధారపడి నివసించే ప్రజలు చాలా మంది ఉన్నారు. ఈ పథకం కింద రైతులకు ప్రతి ఏటా 6000 నగదు అందుతుంది.
అయితే ఇప్పటివరకు పదకొండు విడతలుగా రైతుల ఖాతాల్లోకి నగదు జమ చేసింది.విడతల వారిగా రూ. 2000 అందిస్తుంది. అయితే తాజాగా పీఎం కిసాన్ పథకంలో కొత్తగా నమోదు చేసుకునేవారికి కొత్త రూల్స్ అందుబాటులోకి తీసుకువచ్చింది కేంద్రం. చాలా మంది అర్హులు కాకున్నా ఈ పథకం పొందుతున్నారన్న ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.
ఈ స్కీమ్ లో చేరేవారికి ఇకపై రేషన్ కార్డు తప్పనిసరి చేసింది.ఈ పథకంలో నమోదు చేసుకునేటప్పుడు అన్నదాతలు తమ రేషన్ కార్డు కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అంతేకాదు.. లబ్దిదారులు EKYC పూర్తి చేసినప్పుడే పీఎం కిసాన్ డబ్బులు మీ ఖాతాలో పడతాయి. కాగా KYC అప్డేట్ చేయడానికి 31 జూలై 2022 చివరి తేదీ.