తెలంగాణ టీచర్లకు బిగ్ షాక్..పాఠశాల విద్యాశాఖ సంచలన ఆదేశాలు

0
40

తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ టీచర్లు ఆస్తుల వివరాలు సమర్పించాలని పాఠశాల విద్యాశాఖ కీలక ఉత్తర్వులు వెలువరించింది. ఏటా ఆస్తుల వివరాలు ప్రకటించాలని,ప్రభుత్వ టీచర్లు స్థిర, ఛర భూములు కొన్నా, అమ్మినా అనుమతి తప్పనిసరి అని పేర్కొంది.

టీచర్లు తమ పేరిట ఉన్న ఆస్తులు, కుటుంబ సభ్యుల పేరిట భవనాలు, ఇళ్ల స్థలాలు, వాణిజ్య స్థలాలు, వ్యవసాయ భూములు ఇలా వాటి వివరాలను మార్కెట్ ధర ప్రకారం వెల్లడించాల్సి ఉంటుంది.ప్రైమరీ టీచర్లు అయితే హెడ్మాస్టర్ లకు, హై స్కూల్ టీచర్లు అయితే ఎంఈఓ లకు సమర్పించాల్సి ఉంటుంది.

అనంతరం ఈ వివరాలన్నీ జిల్లా విద్యాధికారుల ద్వారా విద్యాశాఖకు చేరుతాయి. అయితే ఇంతకుముందు ఎప్పుడు లేని విధంగా ఆస్తుల వివరాలు అడుగుతూ సర్క్యులర్ జారీ చేయడం ఉపాధ్యాయ వర్గాల్లో ఆందోళన రేకెత్తిస్తుంది.